ఆర్జీవీ ఆఫీసు ముందు అలజడి..
- December 25, 2023
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీసు ముందు అలజడి చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి వర్మ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే వర్మ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
వ్యూహం సినిమాలో పాత్రలను వర్మ చూపించిన తీరును నిరసిస్తూ, ఆ మూవీ రిలీజ్ చేయొద్దంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు జోలికి రావద్దని హెచ్చరించారు. పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..