మహేష్ ఫ్యాన్స్‌కి ఇది కదా కావల్సింది.!

- December 26, 2023 , by Maagulf
మహేష్ ఫ్యాన్స్‌కి ఇది కదా కావల్సింది.!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’కి ఏం చేసినా హైప్ తీసుకురాలేకపోతున్నారు. సంక్రాంతికి ధియేటర్లలో సందడి చేయాల్సిన అసలు సిసలు సంక్రాంతి మూవీ ఇది.

అలాంటిది, ప్రమోషన్లు ఏ రేంజ్‌లో ప్లాన్ చేసుకోవాలి.! అసలే అక్కడున్నది గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఏదో ఒక మ్యాజిక్ చేయాలి.

అయితే, టైటిల్ రిలీజ్ నుంచీ ఫ్యాన్స్‌లో అసహనమే కనిపిస్తోంది. ఇక, రీసెంట్‌గా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కి సంబంధించిన లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అస్సలేమాత్రం బాలేవంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఏదోలా ఆ లొల్లి కాస్తా చల్లారింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ నుంచి మరో మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. మాస్ అంటే మామూలుగా లేదు మరీ. శ్రీలీల, మహేష్ బాబు ఇరగదీస్తున్నారు.

కాదు కాదు దుమ్ము లేపేస్తున్నారు. పాట ఎలా వుంటుందో ఏమో కానీ, ఈ పోస్టర్‌కి అయితే మంచి రెస్పాన్సే వస్తోంది. ఇదే ఊపు ఇలా కొనసాగేలా వుంటే ఫర్వాలేదు చూడాలి మరి ఏం చేస్తారో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com