#RC16.! రామ్ చరణ్ - బుచ్చిబాబు మామూలుగా వుండదు.!

- December 26, 2023 , by Maagulf
#RC16.! రామ్ చరణ్ - బుచ్చిబాబు మామూలుగా వుండదు.!

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు సన.

చాలా కాలంగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం స్క్రిప్ట్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదో స్పోర్ట్స్ డ్రామా అని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు పలకబోతున్నాడనీ తెలుస్తోంది.

‘రంగస్థలం’ సినిమా కోసం గోదారి యాసలోకి మారిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో అసలు సిసలు ఉత్తరాంధ్ర కుర్రోడిలా మారిపోనున్నాడట.

మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందనీ తెలుస్తోంది. 

ప్రస్తుతం రామ్ చరణ్, ‘గేమ్ ఛేంజర్’ మేనియాలో వున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజవుతుందో మాత్రం ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే అది శంకర్ సినిమా కదా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com