అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తి..

- December 27, 2023 , by Maagulf
అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తి..

అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

దాదాపు 8,000 మంది ప్రముఖులు జనవరి 22న జరిగే పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం కోసమని ఆహ్వానం అందించారు. అంతేకాకుండా.. సైట్‌లో పనిచేస్తున్న 15 శాతం మంది వ్యక్తులకు ఆహ్వానం అందించనున్నారు. ఈ సందర్భంగా ఓ కూలీ మాట్లాడుతూ.. ఆలయ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని, ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్నామని, జనవరి 22న ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని చెప్పారు.

ఇదిలా ఉంటే.. మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రైల్వే స్టేషన్‌లోని కొత్త టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా, శనివారం మరో మెగా ఈవెంట్ జరగనుంది. అంతేకాకుండా.. ఎయిర్‌లైన్స్ అయోధ్య నుండి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్‌తో సహా ప్రధాన నగరాలకు విమానాయాన సేవలు అందిస్తాయి. అయోధ్యలోని శ్రీరామ్ ఇంటర్నేషనల్ సౌకర్యాలతో పోల్చితే విమానాశ్రయం కూడా మసకబారేలా ఈ స్టేషన్‌ను చక్కటి వ్యవస్థీకృత పద్ధతిలో అభివృద్ధి చేశారు. శిశు సంరక్షణ, సిక్ రూమ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఫైర్ ఎగ్జిట్‌తో సహా దేశంలోనే అతిపెద్ద కాన్‌కోర్స్ సెటప్ కూడా ఇక్కడ పూర్తవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com