దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు: మెట్రో, ట్రామ్ నాన్‌స్టాప్ సర్వీసులు
- December 28, 2023
యూఏఈ: దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ మెట్రో, ట్రామ్ సిద్ధమయ్యాయి. ఈ రెండు ప్రధాన పబ్లిక్ రవాణా సేవలు డిసెంబర్ 31 నుంచి 40 గంటల పాటు నాన్‌స్టాప్‌గా నడుస్తాయని రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. దుబాయ్ మెట్రో డిసెంబర్ 31 ఉదయం 8 నుండి జనవరి 1న తెల్లవారుజాము, దుబాయ్ ట్రామ్ డిసెంబర్ 31 ఉదయం 9 నుండి జనవరి 2తెల్లవారుజామున 1 వరకు నడుస్తాయి. ఆర్టీఏ 230 బస్సులను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోందని ఆర్టీఏ సీఈఓ అబ్దుల్లా యూసిఫ్ అల్ అలీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను చూసేందుకు వచ్చే ప్రజలకు తగిన పార్కింగ్ ఉండేలా అల్ వాస్ల్, అల్ జాఫిలియాలో సుమారు 900 అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







