వాడి అల్ మావిల్ లో బయటపడ్డ 4,500 సంవత్సరాల నాటి వస్తువులు
- December 28, 2023
వాడి అల్ మావిల్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని వాడి అల్ మావిల్ విలాయత్‌లో హెరిటేజ్ , టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన పురావస్తు సర్వే, పరిశోధనలో 4,500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి అనేక పురావస్తు వస్తువులలు బయటపడ్డాయి. ఇటాలియన్ మిషన్ సహకారంతో సపియెంజా విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనల్లో ఇనుప యుగం నాటి కుండలు, తెల్లని పూసలు, రాతి పూసలు వెలుగుచూశాయి. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని హెరిటేజ్ మరియు టూరిజం శాఖ డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాసర్ అల్ హిలాలీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో యుగాలుగా మానవ నివాసాలు ఎక్కువగా ఉన్నాయని రుజువు అయిందన్నారు. పురావస్తు ప్రదేశాలలో శాస్త్రీయ సర్వే, త్రవ్వకాల క్రమబద్ధమైన కార్యక్రమాన్ని అమలు చేసిన తర్వాత పురాతన వస్తువులను ఎక్కువగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







