ఈజీ ఇ-వీసా, టూరిజం ఆఫర్లతో ఖతార్ కు పోటెత్తిన టూరిస్టులు!
- December 28, 2023
దోహా: హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రవేశపెట్టిన ఈజీ ఇ-వీసా, టూరిజం ఆఫర్లు పర్యాటక ఆకర్షణల ద్వారా ఖతార్లోకి సందర్శకుల రాకపోకలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ఖతార్ టూరిజం ప్రకారం.. ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 కోసం భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గత సంవత్సరం ఫుట్‌బాల్ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం వల్ల ఈ సంవత్సరం మొదటి 11 నెలల్లో సందర్శకుల సంఖ్య 3.53 మిలియన్లకు చేరుకుంది.అదే విధంగా జీవన నాణ్యత సూచికలో ఖతార్ ఉన్నత స్థానంలో ఉంది. హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం ఖతార్ పర్యాటక రంగం వృద్ధిలో కీలకపాత్ర పోషించింది. ఖతార్ 101 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. ప్రభుత్వం ప్రపంచ కప్ అభిమానులకు జారీ చేసిన హయ్యా వీసాల చెల్లుబాటును ఫిబ్రవరి 24, 2024 వరకు పొడిగించింది. ఖతార్ వింటర్ టూరిజం సీజన్, దోహా పోర్ట్, కార్నిచ్, ది పెరల్ ఐలాండ్ మరియు లుసైల్ మెరీనా ప్రొమెనేడ్ వంటి బహిరంగ ప్రదేశాలు అత్యుత్తమ పర్యాటక ఆకర్షణలుగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా దోహా పోర్ట్ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎక్స్పో 2023 దోహా, అలాగే 2023, 2024లో జరుగుతున్న ఇతర మెగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటక రంగ వృద్ధికి దోహదం చేశాయి. రాబోయే ప్రధాన ఈవెంట్లలో AFC ఆసియా కప్ ఖతార్ 2023 జనవరి, ఫిబ్రవరి 2024లో జరుగుతుంది. ఫిబ్రవరిలో కతారా ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఫెస్టివల్, మోటోజీపీ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఖతార్ 2024, ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ 2024 జరుగనున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..