దుబాయ్ లో న్యూఇయర్ వేడుకలు: షేక్ జాయెద్ రోడ్‌ మూసివేత టైమింగ్స్

- December 28, 2023 , by Maagulf
దుబాయ్ లో న్యూఇయర్ వేడుకలు: షేక్ జాయెద్ రోడ్‌ మూసివేత టైమింగ్స్

దుబాయ్: డిసెంబరు 31 సాయంత్రం 4 గంటల నుంచి కొత్త సంవత్సర వేడుకల కోసం రోడ్లను మూసివేయడం ప్రారంభించనున్నట్లు దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. డౌన్‌టౌన్ ప్రాంతం,  ఇతర ప్రసిద్ధ ప్రదేశాలకు వచ్చే సందర్శకులు మరియు నివాసితులు తమ ప్రయాణాలను ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ విభాగానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఒబైద్ జుమా అల్ ఫలాసి సూచించారు.  మహ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ సాయంత్రం 4 గంటలకు మూసివేయడం ప్రారంభమవుతుంది. ఫైనాన్షియల్ రోడ్ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మూసివేయబడుతుంది. అల్ అసయెల్ రోడ్ కూడా సాయంత్రం 4 గంటలకు మూసివేయబడుతుంది. ఈ రోడ్ల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా షేక్ జాయెద్ రోడ్డుకు మళ్లించబడుతుందని తెలిపారు. షేక్ జాయెద్ రోడ్, దుబాయ్ యొక్క ఆర్టీరియల్ హైవే, అన్ని రకాల ట్రాఫిక్‌లకు రాత్రి 9 గంటలకు మూసివేయబడుతుంది. మరోవైపు ఎమిరేట్ అంతటా నూతన సంవత్సర వేడుకల కోసం సన్నాహాలు జోరందుకున్నాయి.  ముఖ్యంగా హట్టా, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్, ఫెస్టివల్ సిటీలో జరిగే వేడుకలు ప్రధానంగా నిల్వనున్నాయి. నూతన సంవత్సర పండుగ సందర్భంగా పౌర రక్షణ, RTA మరియు అంబులెన్స్‌లకు మద్దతుగా ఎమిరేట్‌లో 10,000 కంటే ఎక్కువ మంది పోలీసు అధికారులు, వాలంటీర్లను, దాదాపు 1,300 వాహనాలను మోహరిస్తామని అల్ ఫలాసి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com