వర్చువల్ క్లయింట్ సర్వీసెస్ బ్రాంచ్‌ను ప్రారంభించిన అథారిటీ

- December 28, 2023 , by Maagulf
వర్చువల్ క్లయింట్ సర్వీసెస్ బ్రాంచ్‌ను ప్రారంభించిన అథారిటీ

బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ వినియోగం ద్వారా సేవలను మెరుగుపరిచేందుకు యజమానుల కోసం దాని వర్చువల్ క్లయింట్ సర్వీసెస్ బ్రాంచ్‌ను సాఫ్ట్‌గా ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రారంభ దశలో వర్చువల్ బ్రాంచ్ నాలుగు ముఖ్యమైన సేవలను అందించనుంది. వర్క్ పర్మిట్ పునరుద్ధరణ, వర్క్ పర్మిట్ రద్దు, వర్కర్ చిరునామాలను అప్డేట్ చేయడం, LMRA సేవలకు సంబంధించిన సాధారణ విచారణలను నిర్వహించడం వంటివి ఉన్నాయని LMRA సీఈఓ నిబ్రాస్ తాలిబ్ తెలిపారు. LMRA కార్యాలయాలకు వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరాన్ని వర్చువల్ సేవలు తగ్గిస్తాయని, సర్వీస్ డెలివరీ నాణ్యత మరియు వేగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని డిప్యూటీ సీఈఓ అహ్మద్ అల్ అరబీ వెల్లడించారు.  వర్చువల్ సేవలను పొందేందుకు ఆసక్తి ఉన్న యజమానులు LMRA వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయవచ్చని తెలిపారు.  వివిధ గవర్నరేట్‌లలో నాలుగు కేంద్రాల ద్వారా ఎల్‌ఎమ్‌ఆర్‌ఏ తన సేవలను నిరంతరం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ముహరక్ గవర్నరేట్‌లోని సీఫ్ మాల్-అరాద్, రిఫా సనాబిస్, మినా సల్మాన్ శాఖలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. శనివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు అదనపు నిర్వహణ సమయం ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com