వర్చువల్ క్లయింట్ సర్వీసెస్ బ్రాంచ్‌ను ప్రారంభించిన అథారిటీ
- December 28, 2023
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ వినియోగం ద్వారా సేవలను మెరుగుపరిచేందుకు యజమానుల కోసం దాని వర్చువల్ క్లయింట్ సర్వీసెస్ బ్రాంచ్‌ను సాఫ్ట్‌గా ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రారంభ దశలో వర్చువల్ బ్రాంచ్ నాలుగు ముఖ్యమైన సేవలను అందించనుంది. వర్క్ పర్మిట్ పునరుద్ధరణ, వర్క్ పర్మిట్ రద్దు, వర్కర్ చిరునామాలను అప్డేట్ చేయడం, LMRA సేవలకు సంబంధించిన సాధారణ విచారణలను నిర్వహించడం వంటివి ఉన్నాయని LMRA సీఈఓ నిబ్రాస్ తాలిబ్ తెలిపారు. LMRA కార్యాలయాలకు వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరాన్ని వర్చువల్ సేవలు తగ్గిస్తాయని, సర్వీస్ డెలివరీ నాణ్యత మరియు వేగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని డిప్యూటీ సీఈఓ అహ్మద్ అల్ అరబీ వెల్లడించారు. వర్చువల్ సేవలను పొందేందుకు ఆసక్తి ఉన్న యజమానులు LMRA వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయవచ్చని తెలిపారు. వివిధ గవర్నరేట్లలో నాలుగు కేంద్రాల ద్వారా ఎల్ఎమ్ఆర్ఏ తన సేవలను నిరంతరం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ముహరక్ గవర్నరేట్‌లోని సీఫ్ మాల్-అరాద్, రిఫా సనాబిస్, మినా సల్మాన్ శాఖలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. శనివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు అదనపు నిర్వహణ సమయం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







