అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌. ఒకేసారి 438 ఐటెమ్‌లు: తలాబత్

- December 28, 2023 , by Maagulf
అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌. ఒకేసారి 438 ఐటెమ్‌లు: తలాబత్

యూఏఈ: ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ తలాబత్ యూఏఈలో కొన్ని ఆకర్షణీయమైన ఆన్‌లైన్ కిరాణా షాపింగ్ ట్రెండ్‌లను వెల్లడించింది.  2022 సంవత్సరంలో యూఏఈ కస్టమర్ అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌లో 438 ఐటెమ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ ఆర్డర్ ఆగస్టు 2న నమోదు అయినట్లు వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం ఒకే కస్టమర్ చేసిన అత్యధిక ఆర్డర్‌ల విషయానికొస్తే.. ఓ కస్టమర్ 595 వ్యక్తిగత ఆర్డర్‌లు చేశాడని పేర్కొంది. ఈ సంవత్సరంలో 12 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువగా నమోదైన ఆర్డర్‌లలో ఎక్కువ భాగం పండ్లు, కూరగాయలు ఉన్నాయని ప్రకటించింది.  ఈ సంవత్సరం రాత్రి 7 గంటల సమయాన్ని పీక్ అవర్‌గా రికార్డ్ అయిందని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com