కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త

- December 29, 2023 , by Maagulf
కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త

కువైట్: ప్రైవేట్ రంగంలోని కార్మికులు అసలు యజమాని ఆమోదంతో మరొక యజమాని కోసం పార్ట్‌టైమ్ పని చేయడానికి అనుమతిస్తూ ఒక నిర్ణయాన్ని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, షేక్ తలాల్ అల్-ఖాలీద్ జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ నుండి పార్ట్‌టైమ్ వర్క్ పర్మిట్ పొందిన తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు రోజుకు గరిష్ఠంగా 4 గంటల పాటు మరొక యజమాని వద్ద పార్ట్‌టైమ్ పనిన చేసేందుకు అనుమతిస్తారు. రిక్రూట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా  కువైట్‌లో ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తి నుండి ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. 

దీనితో పాటు ప్రైవేట్ రంగంలో రిమోట్ వర్క్‌ను అనుమతించాలని, ప్రక్రియను నిర్వహించడానికి నిబంధనలను సిద్ధం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌ ను మంత్రి ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com