యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి

- December 29, 2023 , by Maagulf
యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి

యూఏఈ: ప్రస్తుతం సెలవులు కావడంతో స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్‌ తక్కువగా ఉందని తెలిపారు. వచ్చే వారం మళ్లీ తరగతులు ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్‌ సాఫీగా ఉండేందుకు పాఠశాలలు వివిధ సమయాలను పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేనందున దాదాపు 20 శాతం సమయం ఆదా అవుతుందని దుబాయ్ నివాసి ఫెర్డినాండ్ ఫ్రాగా హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌లో ఉన్న స్కూల్స్ టైమింగ్స్ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. “పాఠశాలలు లేని సమయంలో భారీ ట్రాఫిక్ ఉండదు. పాఠశాలలకు వేర్వేరు సమయాలను పాటించడం వలన ట్రాఫిక్ కు ఒక పరిష్కారం అని లభిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు అందరూ ఒకే సమయంలో రాకపోవడం వలన కార్ల సంఖ్య తగ్గుతుంది.  ” అని వివరించారు. మరోవైపు అల్ బార్షా సౌత్‌లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ మాట్లాడుతూ.. యూఏఈలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూల్స్ కారణంగా తక్కువ ఒత్తిడి, తక్కువ ట్రాఫిక్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. "విద్యార్థులు చాలా ముందుగానే లేవవలసి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. యూఏఈలో చాలా సందర్భాలలో ఉదయం 5.30 లేదా ముందుగానే పాఠశాల బస్సులు వారిని ఎక్కించుకున్నప్పుడు ఇది వారి మొత్తం ఆరోగ్యం, శ్రద్ధ, ప్రవర్తన మరియు ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.” అని షార్జాలోని NMC మెడికల్ సెంటర్‌లోని స్పెషలిస్ట్ శిశువైద్యుడు డాక్టర్ సంజయ్ ఉధాని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com