న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్..ఆర్టీఏ ఉచిత పార్కింగ్
- December 29, 2023
దుబాయ్: దుబాయ్‌లోని వాహనదారులు రాబోయే లాంగ్ వీకెండ్‌లో రెండు రోజుల ఉచిత పార్కింగ్‌ను ఆనందించవచ్చు. కొత్త సంవత్సరం మొదటి రోజున పబ్లిక్ పార్కింగ్ ఉచితం అని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. దుబాయ్‌లో ఆదివారాల్లో చెల్లింపు పార్కింగ్ ఉచితం. మల్టీలెవెల్ టెర్మినల్‌లకు ఉచిత పార్కింగ్ వర్తించదు. పార్కింగ్ టారిఫ్ జనవరి 2, 2024న మళ్లీ యాక్టివేట్ అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి నివాసితులు మూడు రోజుల వారాంతాన్ని ఆనందిస్తారు. జనవరి 1 పబ్లిక్ సెలవుదినం, శనివారం-ఆదివారం వారాంతంతో కలిపితే, అది మూడు రోజుల లాంగ్ వీకెండ్ కానుంది.
కాగా, టెక్నికల్ టెస్టింగ్ మరియు కస్టమర్ సర్వీస్ సెంటర్లు జనవరి 1న మూసివేయబడతాయి. దుబాయ్ మెట్రో రెడ్ మరియు గ్రీన్ లైన్లు డిసెంబర్ 31, 2023 ఉదయం 8 గంటల నుండి జనవరి 1, 2024 రాత్రి 11.59 గంటల వరకు నడుస్తాయి. దుబాయ్ ట్రామ్ డిసెంబర్ 31, 2023 ఉదయం 9 గంటల నుండి జనవరి 2, 2024 ఉదయం 1 గంటల వరకు నడుస్తాయని ఆర్టీఏ తెలిపింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!