కువైట్‌లో కోవిడ్ JN.1 కేసు నమోదు
- December 29, 2023
కువైట్: కువైట్‌లో కోవిడ్-19 వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇది ఊహించనదేనని ఆందోళన కలిగించేది కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ గురువారం తెలిపారు. దేశంలో కోవిడ్ వేరియంట్లు మరియు ఇతర వైరస్ల వ్యాప్తిని అనుసరించే బాధ్యత కలిగిన జన్యు పరీక్ష బృందాల ద్వారా పరీక్షల ఫలితంగా JN.1 కేసులను నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి అసాధారణ నివారణ చర్యలు తీసుకోవడం లేదని డాక్టర్ అల్-సనాద్ చెప్పారు. సాధారణంగా శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కాలానుగుణ వైరస్‌లను దానితో పాటు తీసుకువస్తుందని పేర్కొన్నారు. వ్యాధి సోకిందని భావించే వ్యక్తులు ఇతరుల నుండి దూరంగా ఉండాలని, వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. కువైట్ అంతటా 42 కేంద్రాలలో మంత్రిత్వ శాఖ ఇన్ఫ్లుఎంజా, న్యుమోనియా లేదా తాజా రకం జబ్లకు టీకాలు అందజేస్తుందని డాక్టర్ అల్-సనద్ తెలిపారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్య కేంద్రాల వద్ద సిబ్బంది పని సమయంలో మాస్క్‌లను ఉపయోగించాలని కూడా ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!