ప్రబాస్ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన.!
- December 30, 2023
చాలా కాలం తర్వాత ‘సలార్’తో పెద్ద హిట్టే అందుకున్నాడు ప్రబాస్. ఇంత హిట్ అందుకున్నాకా కూడా ప్రబాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం లేదు.
అందుకు కారణం తమ అభిమాన హీరోలో గతంలో మాదిరి హుషారు లేకపోవడమే. ‘సలార్’ రిలీజ్‌కి ముందు కానీ, తర్వాత కానీ ఎక్కడా ప్రబాస్ కనిపించకపోవడమే అభిమానుల్లో అసహనానికి కారణం.
అయితే, ప్రబాస్ అంతు చిక్కని అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనీ, ‘బాహుబలి’ టైమ్‌లో తగిలిన కాలి గాయం.. ఇప్పుడు మళ్లీ ‘సలార్’ కారణంగా ఇబ్బంది పెడుతోందనీ ప్రచారం జరుగుతోంది.
అందుకే ఆయన బయటికి రావడం లేదనీ అంటున్నారు. సెప్టెంబర్‌లో లండన్‌లో ఓ మేజర్ సర్జరీ జరిగింది ప్రబాస్ కాలికి. అది పూర్తిగా నయం కాలేదు. ఇప్పుడు మళ్లీ బాధిస్తోందట.
దాంతో, ప్రబాస్ తదుపరి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనీ.! ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలవుతుంది. భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి’లో ప్రబాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. ‘సలార్’ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. ఈ తరుణంలో ప్రబాస్ ఆరోగ్యం సపోర్ట్ చేయకుంటే ఎలా.? అని ఆరా తీస్తున్నారు. కానీ, అభిమానుల సందేహాలకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు రెబల్ స్టార్ నుంచి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?