డిసెంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలి: సిపి రెమా రాజేశ్వరీ
- December 30, 2023
తెలంగాణ: ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరీ సూచించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను సిపి ఒక ప్రకటనలో తెలిపారు. 31వ తేది రాత్రి 10 గంటల నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రమాదల నివారణకు, అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ, ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణతో పాటు పెట్రోలింగ్ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఏర్పాటు చేసే సంస్కతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నత్యాలకు అనుమతి లేదని, అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఆర్కెస్ట్రా, డిజేలు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వం అనుమతించిన సమయపాలన పాటించాలని సూచించారు. ట్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువతపై ఏదైనా కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవని, యువత గమనించగలరని పేర్కొన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త, పర్యవేక్షణ ఉండాలని, అందరు బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు, యువత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..