న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు

- December 31, 2023 , by Maagulf
న్యూ ఇయర్...ప్రజలకు భారత రాయబారి శుభాకాంక్షలు

కువైట్: నూతన సంవత్సరం 2024 సందర్భంగా. కువైట్ నాయకత్వానికి మరియు ప్రజలకు కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కువైట్‌లోని పెద్ద మరియు శక్తివంతమైన భారతీయ సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 రాకతో అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, కొత్త ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నాయకత్వంలో కువైట్ కొత్త శకంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారతదేశం - కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలను సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఆశతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, విజయం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com