స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- January 03, 2024 , by Maagulf
స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ప్రభుత్వ స్కూల్స్ కు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. కాగా జనవరి 12న ఆప్షనల్ హాలీడే, 13న 2వ శనివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా హాలీడే రానుంది. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులపై క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ పండుగ హడావుడి కనిపించనుంది. బస్సులు, రైళ్లల్లో రద్దీ పెరగనుంది. ఇప్పటికే సెలవులకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసున్నారు ప్రజలు. ఇక సంక్రాంతి పండగంటే..తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంబరాన్ని తాకుతుంది.

రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అంతేకాదండోయ్ హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సంక్రాంతి వస్తుందంటే చాలు.. దేశ నలుమూలాలనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న సరే వారంతా తమ సొంతళ్లుకు వచ్చి పండగను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com