YSRTP విలీనం: కాంగ్రెస్లో చేరిన వై.ఎస్. షర్మిల
- January 04, 2024
న్యూఢిల్లీ:యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (YSRTP) అధినేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.వై.ఎస్. షర్మిల తన భర్త అనిల్ తో కలిసి గురువారంనాడు ఉదయం ఎఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలను ఉపయోగించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..