కెసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్

- January 04, 2024 , by Maagulf
కెసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బిఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కెసిఆర్ నివాసానికి వెళ్లారు. కెసిఆర్ నివాసం వద్ద జగన్ కు కెటిఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కెసిఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కెసిఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ విజయవాడకు తిరుగుపయనమవుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com