కెసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్
- January 04, 2024
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో బిఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం జగన్ అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కెసిఆర్ నివాసానికి వెళ్లారు. కెసిఆర్ నివాసం వద్ద జగన్ కు కెటిఆర్ ఆహ్వానం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కెసిఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు కెసిఆర్ నివాసంలో జగన్ గడపనున్నారు. లంచ్ మీటింగ్ కూడా ఉందని తెలుస్తోంది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత జగన్ విజయవాడకు తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..