అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- January 04, 2024
హైదరాబాద్: బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
ఒక వారం రోజుల్లో వారి సమస్యల పరిష్కారిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటి వేస్తామన్నారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని సజ్జనార్ అన్నారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండబోదన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్నారు.
'' సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా తిప్పుతాం. సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌ను కలిశాం. 5 సమస్యలను సజ్జ నార్కి విన్నవించాం. ఎండీ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 10 వ తేదీలోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాము'' అని ఆర్టీసీ అద్దె బస్సు యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..