శబరిమలకు అయ్యప్ప భక్తుల రద్దీ..మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం!!

- January 04, 2024 , by Maagulf
శబరిమలకు అయ్యప్ప భక్తుల రద్దీ..మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం!!

కేరళలో ఇసుకేస్తే రాలనంత మంది అయ్యప్ప భక్తులు కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రావటంతో భక్తుల సందడి కొనసాగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో రావటంతో అయ్యప్పస్వామి దర్శనానికి ఆలస్యం అవుతుంది.

ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటల నుండి 12 గంటల సమయం పడుతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తుల రాక శబరిమలకు విపరీతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారులు శబరిమలకు చేరుకుంటున్నారు. కేరళ అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా వస్తున్న క్రమంలో ఈ మేరకు భక్తులు గంటల తరబడి లైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రావెన్ కోర్ దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేసినా అక్కడ వసతులు అరా కొరగానే ఉన్నాయి.

అయితే శబరిమలకు పోటెత్తుతున్న భక్త జన సాగరం నేపధ్యంలో, భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి దర్శనం కోసం పరిమితి మేరకే భక్తులను అనుమతి ఇస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం ట్రస్ట్‌ పేర్కొంది. ఈనెల 14న 40వేల మంది భక్తులకు, 15వ తేదీన 50వేల మంది భక్తులకు దర్శనం చేసుకోవటానికి అనుమతి ఇచ్చింది.

అంతేకాదు 14, 15 తేదీలలో మహిళలు, పిల్లలు రావొద్దని భక్తులను కూడా అప్రమత్తం చేసింది. అంతేకాదు ఈ నెల 10 వ తేదీ నుండి స్పాట్ బుకింగ్ లను రద్దు చేసినట్టు సంచలన ప్రకటన చేశారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని ప్రతీరోజూ లక్షకు తక్కువ కాకుండా అయ్యప్ప భక్తులు దర్శించుకుంటున్నారు.

నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు మండల దీక్షకు వచ్చిన భక్తులే 32 లక్షల మంది ఉన్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం పేర్కొంది. దీంతో ఏకంగా 241కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు వెల్లడించింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుందని, ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com