వర్క్ పర్మిట్ జారీ చేసే ముందు ప్రవాసులకు స్కిల్ టెస్ట్
- January 04, 2024
కువైట్: వర్క్ పర్మిట్ జారీ చేసే ముందు సాంకేతిక కార్మికులకు త్వరలో నైపుణ్య పరీక్షను ప్రారంభిస్తామని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రకటించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ సహకారంతో పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు.. దేశంలో స్మార్ట్ రిక్రూట్‌మెంట్‌ను అమలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. కువైట్ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ప్రాక్టికల్, టెక్నికల్ టెస్ట్‌లను నిర్వహించడం గురించి PAM మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వర్క్ పర్మిట్ జారీ చేయడానికి ముందస్తు షరతుగా ఉంటుంది. లేబర్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడం కోసం కువైట్‌లో పనిచేస్తున్న సాంకేతిక శ్రామికశక్తి స్థాయిని పెంచేందుకు ఈ పరీక్షలు సహాయపడతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









