సౌదీ కెమికల్ కంపెనీలో ప్రమాదం. ఇద్దరు మృతి
- January 04, 2024
రియాద్: రియాద్‌కు ఉత్తరాన ఉన్న అట్షానాలోని ఒక కర్మాగారంలో మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. సౌదీ కెమికల్ కంపెనీ హోల్డింగ్‌కు అనుబంధ సంస్థ అయిన సౌదీ కెమికల్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. "ఈ విషాద ప్రమాదం సంస్థ మరియు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







