యాత్ర 2 టీజర్ రిలీజ్..
- January 05, 2024
ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్.. యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా, మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. తమిళ నటుడు జీవా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు.
మహి వి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ మూవీని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఇక యాత్రలో వైఎస్సార్ బయోపిక్ గా చూపిస్తే యాత్ర 2 వైఎస్ జగన్ బయోపిక్ గా రానుంది. వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో రానుంది యాత్ర 2. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ తో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









