‘తండేల్’.! టీజర్ అదిరిందోయ్.!
- January 06, 2024
‘ఒగ్గి లేపి దుల్లగొట్టేస్తా..’ అంటున్నాడు అక్కినేని బుల్లోడు నాగ చైతన్య. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘తండేల్’ లోనిది ఈ డైలాగ్. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
జాలర్ల నేపథ్యంలో యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
చాలా ప్రామిసింగ్‌గా వుంది గ్లింప్స్. మాస్, ఊరమాస్ గెటప్‌లో నాగ చైతన్య కనిపిస్తున్నాడు. ఉత్తరాంధ్ర యాసలో చైతూ ఈ సినిమాలో డైలాగులు చెప్పబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. తాజా గ్లింప్స్ అందుకు సాక్ష్యంగా నిలిచింది.
ఆ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో వున్న పదం ‘దుల్లగొట్టేస్తా..’ ఆ పదాన్ని చాలా తేలికగా వాడేశాడు చైతూ. కథ, కథనం కూడా చాలా బలంగా వుండబోతున్నాయని గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ దేశభక్తి యాంగిల్ కూడా చూపించబోతున్నారని అర్ధమవుతోంది.
గ్లింప్స్ చివరిలో సాయి పల్లవి ఎంట్రన్స్ గ్లింప్స్ అట్మాస్పియర్నే మార్చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా చైతూకి ఖచ్చితంగా కలిసొచ్చేలానే కనిపిస్తోంది. రికార్డ్ బ్రేకింగ్ మూవీ అవుతుందనిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







