ప్రముఖుల నడుమ ఘనంగా ముగిసిన 'వేవ్' వార్షికోత్సవాలు
- May 30, 2016
దుబాయి లో తెలుగు వారి ఆత్మీయ వారధి వేవ్ 9 వ వార్షికోత్సవ సంబరాలు ఇక్కడి స్థానిక రషీద్ ఆడిటోరియంలో మే 27 న వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం లో అలనాటి అందాల తార శ్రీమతి రాధ , ఒలింపిక్ లో పతకాన్ని సాధించిన తెలుగు తేజం శ్రీమతి కరణం మల్లీశ్వరి మరియు మిమిక్రి రమేష్ పాల్గొన్నారు. ముందుగా రోహన్ సాయి గణపతి స్తోత్రం తో కార్యక్రమం ప్రారంభమైనది. వేవ్ కార్య వర్గ సభ్యులు అంతా కలిసి శ్రీమతి రాధ గారిని వేదికపైకి తోడ్కొని రాగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలని ప్రారంభించారు.శ్రీమతి సుధా విజయ్ కుమార్ , ప్రశాంతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి ప్రార్ధనా గీతాన్ని ఆలపించారు. ప్రముఖ నృత్య కళా కారిణి శోభా నాయుడు రూపొందించిన గణపతి పంచరత్నం , చిన్నారులు పాడిన ఐ గాట్ ఫ్రొం మై డాడి , ప్రీతి , హర్ష చేసిన దర్పణ నృత్య రూపకం ఆహుతులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.కేవలం స్థానికంగా ఇక్కడ చదువుకుంటున్న విధ్యార్దులతోనే ఈ నృత్యాలన్ని అభినయించటం విశేషం.
మిమిక్రి రమేష్ గారు పలు సినిమా , రాజకీయ ప్రముఖుల్ని అనుకరిస్తూ చేసిన మిమిక్రి కి సభికులనుండి విశేష స్పందన లభించింది. శ్రీ కోడెల మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారంతా ఒకటే నని. తాను 20 దేశాల్లో పలు తెలుగు వారి సమావేశాలకి వెళ్లానని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం లో ఎన్ ఆర్ ఐ ల పాత్ర ఎంతో కీలకమైనదని , అందుకే ఎన్ని పనులున్నా మీరు పిలిస్తే అవన్నీ పక్కన పెట్టి వస్తాను అని చెప్పారు. చాలావరకు ఈ కార్యక్రమాలని రూపొందించిన వేవ్ సంస్థ నిర్వాహకులు శ్రీమతి గీత గారికి కళాకారులు , చిన్నరులంతా తమ ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డులని దుబాయ్ లో వ్యాపార వేత్తలుగా రాణిస్తున్న శ్రీ ధనేకుల సురేంద్ర మరియు శ్రీ దువ్వూరు కిషోర్ బాబు లకు ప్రదానం చేశారు. వీరితోపాటు ఇండియాలో ఉన్న మరో 5 గురు వ్యాపార వేత్తలకి ప్రదానం చేసారు.
సాయంత్రం 7 గంటలకి ప్రారంభమైన ఈ కార్యక్రమం 11 గంటలవరకు కొనసాగింది. వచ్చిన ప్రేక్షకులంతా చివరివరకు ఉండి అన్ని కార్యక్రమాలని వీక్షించి తమ అభినందలని తెలియచేయటం విశేషం. గత 9 సంవత్సరాలుగా తెలుగు కార్యక్రమాలని దుబాయ్ లో నిర్వహిస్తూ , ఇక్కడి తెలుగు వారికి మన సంస్కృతీ సాంప్రదాయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేరువ చేస్తున్న వేవ్ సంస్థ ని అలాగే సంస్థ నిర్వహిస్తున్న శ్రీమతి గీత , శ్రీ రావెళ్ళ రమేష్ బాబు గారిని అలాగే వేవ్ సంస్థలో భాగస్వాములైన ప్రతి మెంబర్ కి విచ్చేసిన అతిధులంతా తమ శుభాకాంక్షలు తెలియ చేసారు. శ్రీమతి కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ దుబాయ్ లో ఇంతమంది తెలుగువారి మధ్య గడపటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా తెలుగు వారు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు సంతోషంగా ఉందని రాధ అన్నారు. ఈ కార్యక్రమ కమిటీ సభ్యులుగా సునీత , సుధ, త్రివేణి , విశాల , ప్రశాంతి , మధు శ్రీనివాస్ , స్వాప్నిక, , వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో వేవ్ సంస్థ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని , అంతర్జాతీయ తెలుగు సమాజంలో తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలని హాజరైన అతిధులు , ప్రేక్షకులు తమ శుభాకాంక్షలు తెలియ చేసారు.
మాగల్ఫ్ టీం తరపున 'వేవ్' టీం కు శుభాకాంక్షలు తెలిపారు.





తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







