మరో 11 సిటీలపై నిషేధం అమలు..
- May 30, 2016
దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 సిటీలపై కూడా విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) నేడు నిర్ణయం తీసుకోనుంది. 11 సిటీల్లో గాలి కాలుష్య డేటా ఆధారంగా ఎన్ జీటీ ఈ నిషేధాన్ని ఆ ప్రాంతాలకు కూడా విధించనుంది. ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పట్నా, లక్నో, అలహాబాద్, కాన్పూర్, వారణాసి, పుణే, నాగ్ పూర్, లుథీనా, జలంధర్, అమృత్ సర్ వంటి సిటీలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో రెండు లీటర్లు, అంతకు ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాలను నిషేధిస్తున్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో ఎక్కువ డీజిల్ ఇంజన్ సామర్థ్యమున్న వాహనాల అమ్మకాలు జరగడం లేదు. ఇదే నిషేధాన్ని కేరళలో కొన్ని సిటీల్లో కూడా ఇటీవలే విధించారు. దీంతో ఆటో పరిశ్రమలో పెట్టుబడులు కోల్పోయాయి. 11వేల వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల్లో ఉద్యోగులపై పడి, 5,500 మంది ఉద్యోగాలు కోల్పోయారని భారత ఆటో మొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) పేర్కొంది. ఒకవేళ ఈ నిషేధం దేశమంతటా విధిస్తే దాదాపు 44 వేల ఉద్యోగాలకు నష్టం చేకూరుతుందని సియామ్ రిపోర్టు నివేదించింది. ఈ నిషేధం నిర్ణయం ఆటో పరిశ్రమల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. ఉత్పత్తి, ఉద్యోగాల్లో నష్టాలు చేకూరుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







