2024లో QR622 మిలియన్లకు వ్యవసాయ రంగం

- January 07, 2024 , by Maagulf
2024లో QR622 మిలియన్లకు వ్యవసాయ రంగం

దోహా: ఖతార్ వ్యవసాయ మార్కెట్ పరిమాణం $170.95m (QR622.34m)కు చేరుకోవచ్చని అంచనా వేసినందున, ఖతార్ వ్యవసాయ పరిశ్రమ ఈ సంవత్సరం ఉత్సాహభరితమైన వృద్ధిని సాధిస్తుందని మోర్డోర్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు తెలిపారు. నివేదిక ప్రకారం, 2029 నాటికి వ్యవసాయ మార్కెట్ పరిమాణం $223.10m (QR812.20m) గా అంచనా వేశారు. గత సంవత్సరం రీసెర్చ్ గ్రూప్‌లోని విశ్లేషకులు మార్కెట్ పరిమాణం సుమారు $162.08m (QR 590.09m)కి చేరుకుందని, 2028 నాటికి మొత్తం $211.53m (QR 770.13m) కు పెరుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రంగం హై-టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని తెలిపింది. ఖతార్ లో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా.. పండ్లు, కూరగాయల నాణ్యతను మెరుగుపరిచిన హైడ్రోపోనిక్స్, స్మార్ట్ ఇరిగేషన్ మరియు ఆక్వాపోనిక్స్ వంటి స్థిరమైన, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఖతార్ గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన రీతిలో ఎదిగిందని నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు. ఖతార్ 2021లో జాతీయ వ్యవసాయ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఆక్వాకల్చర్, హైడ్రోపోనిక్స్‌ను ఉపయోగించుకునే ఆక్వాపోనిక్ సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 32,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు. రాబోయే సంవత్సరాల్లో కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఖతార్ ప్రణాళికలు వేస్తున్నట్లు మునిసిపాలిటీ మరియు పర్యావరణ శాఖ మంత్రి తెలిపారు. 2024లో మార్కెట్ అవసరాలలో దాదాపు 70 శాతం ఖతార్ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు.      

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com