నా సామిరంగ.! అసలు సిసలు సంక్రాంతి బుల్లోడే నాగ్.!
- January 08, 2024సంక్రాంతి సినిమాల్లో ఒకటైన ‘నా సామిరంగ’ అసలు సిసలు సంక్రాంతి మూవీగా అభివర్ణించబడుతోంది. ఈ సీజన్లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా వున్నాయ్.
మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ వున్న సినిమాలు. ‘సైంధవ్’ యాక్షన్ మూవీ. అయినా ఫర్లేదు అంచనాలు బాగానే వున్నాయ్. 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అలాగే, 12న రాబోయే ‘గుంటూరు కారం’ సినిమా పైనా అంచనాలు వున్నప్పటికీ, ట్రైలర్ రెస్పాన్స్ మిక్స్డ్ వేలో వస్తోంది. ఇక, 14న సంక్రాంతికి విడుదలవుతోన్న ‘నా సామిరంగ’ మాత్రం అంచనాలు పెంచేస్తోంది.
నిజానికి లేట్‌గా సెట్స్ పైకి వెళ్లి అత్యంత వేగంగా పూర్తయిన సినిమా ‘నా సామిరంగ’. తక్కువ టైమ్‌లోనే సినిమాని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రమోషన్లలో భాగంగా వదిలిన క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ కూడా ఆసక్తికరంగా వుంది.
ఇక, నాగార్జునతో పాటూ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. వంటి యంగ్ హీరోల పాత్రలతో పాటూ, హీరోయిన్ ఆషికా రంగనాధ్ పాత్ర చిత్రీకరణ కూడా బాగుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే, ‘నా సామిరంగ’ సినిమాకి అన్నీ ప్లస్ పాయింట్స్‌గానే కనిపిస్తున్నాయ్. ఏమాత్రం ప్రచార చిత్రాలకు తగ్గట్లుగానే కంటెంట్ నచ్చిందంటే.. సంక్రాంతికి ఖచ్చితంగా నిలదొక్కుకునే సినిమా ‘నా సామిరంగ’.! ఇది ఫిక్స్..!
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు