‘ఓజీ’ని వాళ్లు వదిలించుకున్నారు.! వీళ్లు పట్టుకున్నారు.!
- January 08, 2024
పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే వున్నాయ్. గ్లింప్స్ రిలీజ్ చేశాకా ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయ్.
అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయ్.
ఈ నేపథ్యంలోనే ‘ఓజీ’ని నిర్మాతలు వదిలించేసుకోవాలనుకుంటున్నారట.. అనే కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన హోమ్ బ్యానర్లో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, దానయ్య చేతిలోంచి ‘ఓజీ’ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు తీసుకున్నారట.. ఆ రకంగా డివివి దానయ్య ఈ సినిమాని వదిలించేసుకున్నారట.. అనేది ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, ఈ ప్రచారంపై తాజాగా దానయ్య అండ్ టీమ్ రెస్పాండ్ అయ్యింది. ఈ ప్రచారంలో ఎంత మాత్రమూ నిజం లేదు. ‘ఓజీ సినిమా మాది.. ఎప్పటికీ అది మాదే.. మా నుంచి ఎవ్వరూ తీసుకోలేదు.. మేం వదులుకునే ప్రశక్తే లేదు..’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!