స్లోవేనియన్ గుహలో చిక్కుకున్న పర్యాటకులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

- January 09, 2024 , by Maagulf
స్లోవేనియన్ గుహలో చిక్కుకున్న పర్యాటకులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

క్రిజానా జమా:  స్లోవేనియన్ గుహలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇద్దరు గైడ్‌లు, ముగ్గురు పర్యాటకులు శనివారం ఉదయం దక్షిణ స్లోవేనియాలో క్రిజానా జమా (లేదా "క్రాస్ కేవ్") అనే గుహలోకి ప్రవేశించారు. అనంతరం భారీ వర్షం కారణంగా వారు తప్పిపోయారు. మూడవ గైడ్ వారి కోసం వెతకడానికి వెళ్ళాడు.  కానీ తప్పిపోయిన బృందాన్ని గుర్తించలేకపోయాడు. వారితో సంబంధాలను పునరుద్ధరించడానికి స్లోవేనియన్ కేవ్ రెస్క్యూ సర్వీస్ (CRS) రంగంలోకి దిగింది. ఈ గుహ స్లోవేనియాలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.  సందర్శకులు గుహ లోపల పడవ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. ఆదివారం గుహలోకి దిగిన డైవర్లు.. తప్పిపోయిన బృందం సభ్యులను గుర్తించి, వారితో మాట్లాడారు.  అయితే అధిక నీటి మట్టం కారణంగా వారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ (ECRA) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుహ ప్రవేశ ద్వారం నుండి 1.3 మైళ్ల దూరంలో ఉన్న ఈ బృందం సభ్యులు మంచి శారీరక, మానసిక స్థితిలో ఉన్నారని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com