దేవర’ ఊచకోత మొదలైంది.!
- January 09, 2024‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీయార్ చేయబోతున్న సినిమా ‘దేవర’. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఈ సినిమా టీజర్‌ని ఎట్టకేలకు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
80 సెకన్ల నిడివితో సాగిన ఈ టీజర్లో ఎన్టీయార్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌కి ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయ్. కారుమబ్బులతో నిండిన ఆకాశం.. అలజడితో ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు, ఆ సముద్రంలో ఓ ఓడ.. దానిపై కొందరు గూండాల దాడి.. వాళ్లని చీల్చి చెండాడుతున్న ఎన్టీయార్.. బ్యాక్ గ్రౌండ్లో ఇంగ్టీష్ సాంగ్.. సన్నివేశాన్ని వివరిస్తున్నట్లుగా వుంది.
చివరాఖరిలో ఈ సముద్రం చేపల్ని కంటే.. కత్తుల్నీ, నెత్తుర్నీ ఎక్కువగా చూసుంటాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు.. అంటూ ఎన్టీయార్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు