పబ్లిక్ పార్కుల్లోకి ప్రవేశానికి నోల్ కార్డులు పనిచేయవు!

- January 09, 2024 , by Maagulf
పబ్లిక్ పార్కుల్లోకి ప్రవేశానికి నోల్ కార్డులు పనిచేయవు!

దుబాయ్: దుబాయ్‌లోని అనేక పబ్లిక్ పార్కులు నోల్ కార్డ్‌లను అంగీకరించడం లేదు. దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లోని పార్కులను ఇటీవల సందర్శించిన నివాసితులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దుబాయ్ మునిసిపాలిటీకి చెందిన కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మాట్లాడుతూ.. " గత ఏడాది అక్టోబర్‌లో డు మరియు దుబాయ్ మునిసిపాలిటీ మధ్య భాగస్వామ్యం సంతకం చేసిన తర్వాత చాలా దుబాయ్ పార్కుల్లో నోల్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ తొలగించబడింది." అని పేర్కొన్నారు. " ఫిజికల్ టిక్కెట్ల అవసరాన్ని తొలగించడం, పబ్లిక్ పార్కులను ప్రజలు యాక్సెస్ చేసే మరియు ఆనందించే విధానాన్ని పునర్నిర్వచించే అత్యాధునిక గుర్తింపు నిర్వహణ వ్యవస్థను సృష్టించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము." అని డు సీఈఓ అయిన ఫహద్ అల్ హస్సావి వెల్లడించారు. కాగా, దుబాయ్‌లోని ఖురాన్ పార్క్‌లో నోల్ కార్డ్ సిస్టమ్‌లోనే టికెటింగ్ ఇప్పటికీ నడుస్తుందన్నారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చినట్లు జబీల్‌ పార్క్‌ ప్రతినిధి తెలిపారు. సఫా పార్క్ వంటి కొన్ని పార్కులు సందర్శకులకు వారి ఫోన్‌ల ద్వారా స్మార్ట్ చెల్లింపును అంగీకరిస్తున్నాయి. సందర్శకులు సామ్ సంగ్ పే, గూగుల్ పే, ఆపిల్ పే ద్వారా చెల్లించవచ్చు. టిక్కెట్‌రహిత ప్రక్రియ ద్వారా కూడా పార్క్‌లోకి ప్రవేశించవచ్చు. 2017లో దుబాయ్ మునిసిపాలిటీ పార్కుల్లోకి ప్రవేశించడానికి నోల్ కార్డును తప్పనిసరి చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com