యూఏఈలో స్వల్ప భూకంపం
- January 09, 2024
యూఏఈ: సోమవారం అర్థరాత్రి యూఏఈలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సిఎం) తెలిపింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ ప్రకారం.. మసాఫీలో రాత్రి 11.01 గంటలకు భూకంపం నమోదైంది. ప్రకంపనలు నివాసితులకు స్వల్పంగా అనిపించినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) సిస్మోలజీ విభాగం డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ మాట్లాడుతూ.. యూఏఈ తక్కువ భూకంప తీవ్రత ఉన్న ప్రదేశంలో ఉందని, అందువల్ల తరచూ స్వల్ప భూకంపానికి లోనవుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూఏఈ అరేబియా టెక్టోనిక్ ప్లేట్‌పై ఉందని, ఇది యురేషియన్ ప్లేట్‌కు వ్యతిరేకంగా ఉందని అల్ ఎబ్రీ వివరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







