‘సామిరంగా’ మరో ‘సోగ్గాడు’ కావడం ఖాయమే.!

- January 10, 2024 , by Maagulf
‘సామిరంగా’ మరో ‘సోగ్గాడు’ కావడం ఖాయమే.!

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా నాగార్జునకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు.

మళ్లీ ఆ కళ ‘నా సామిరంగా’కి కనిపిస్తోంది. ఇద్దరు యంగ్ హీరోల కాంబినేషన్‌లో ‘నా సామిరంగ’ అంటూ సినీ ప్రియుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు కింగ్ నాగార్జున.

ఈ నెల 14న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. లేటైనా, లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో నాగార్జున ‘నా సామిరంగా..’ తనదైన పంచ్ డైలాగులతో పిచ్చెక్కిస్తున్నాడు.

‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ టైమ్‌లో నాగార్జునలా వింటేజ్ లుక్స్‌తో కేక పుట్టిస్తున్నాడు. కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటూ, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో వుండబోతున్నాయని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

విజయ్ బిన్ని అను కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. చూడాలి మరి, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రేంజ్ ‘నా సామిరంగా’ అందుకుంటుందో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com