అమెరికాకు బహ్రెయిన్ కీలక భాగస్వామి: బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

- January 11, 2024 , by Maagulf
అమెరికాకు బహ్రెయిన్ కీలక భాగస్వామి: బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

బహ్రెయిన్: అమెరికాకు బహ్రెయిన్ కీలక భాగస్వామి అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలపై ఆయన సమాధానాలు ఇచ్చారు. గాజాలో ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చూసుకోవడంపై తాము దృష్టి సారించామన్నారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్‌కు సంబంధించి హౌతీల నుండి వస్తున్న దురాక్రమణపై ధీటుగా స్పందిస్తున్నట్లు తెలిపారు.  ఇరాన్ సహాయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కమర్షియల్ షిప్పింగ్‌కు వ్యతిరేకంగా హౌతీల దాడుల కారణంగా వేలాది ఓడలు దారి మళ్లించాల్సి వచ్చిందన్నారు. ఇంధనం, ఔషధం, ఆహారం వరకు ప్రతిదానికీ ప్రజలపై అధిక ధరల భారం పడుతుందన్నారు. ఎర్ర సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛను, షిప్పింగ్ స్వేచ్ఛను సంరక్షించడానికి తాము చేయగలిగినదంతా చేస్తామని తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ - ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్‌లో ఇద్దరు భాగస్వాములు అని గుర్తుచేశారు. గాజాలో మానవతా సహాయం అందేలా చేయడం తమ విధానమన్నారు. ఇదే విధానంపై  త్వరలో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్, ఈజిప్టు అధ్యక్షుడు సిసితో, జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com