2024 పాస్‌పోర్ట్ ఇండెక్స్: టాప్ ప్లేస్ లో యూఏఈ

- January 12, 2024 , by Maagulf
2024 పాస్‌పోర్ట్ ఇండెక్స్: టాప్ ప్లేస్ లో యూఏఈ

యూఏఈ: హెన్లీ & పార్ట్‌నర్స్ 2024 పాస్‌పోర్ట్ ఇండెక్స్ బుధవారం విడుదల నివేదిక ప్రకారం.. యూఏఈ పాస్‌పోర్ట్ 11వ స్థానంలో నిలిచింది. 183 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను ఇది అందిస్తోందని తెలిపింది. యూఏఈ గత దశాబ్దంలో ఇండెక్స్‌లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. 2014 లో 106 గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశంతో జాబితాలో 55వ స్థానంలో ఉండగా.. తాజాగా 11వ స్థానానికి చేరుకుంది.  యూఏఈ పాస్‌పోర్ట్ జీసీసీ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉంది. ఆ, తర్వాతి స్థానాల్లో ఖతార్ (53), కువైట్ (55), బహ్రెయిన్ (59), ఒమన్ (60) మరియు సౌదీ అరేబియా (61) ఉన్నాయి.  

ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ మరియు సౌదీ అరేబియా పాస్‌పోర్ట్ హోల్డర్‌లు వరుసగా 108, 102, 91, 90 మరియు 89 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగిఉన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ (104), సిరియా (103), ఇరాక్ (102), పాకిస్తాన్ (101),  యెమెన్ (100) హెన్లీ & పార్ట్‌నర్స్ 2024 పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అట్టడుగున ఉన్నాయి. బంగ్లాదేశ్ ఒక స్థానం ఎగబాకి 97వ స్థానంలో ఉండగా, భారతదేశం మూడు స్థానాలు మెరుగుపడి 80వ స్థానంలో నిలిచింది. ఇండెక్స్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (Iata) అధికారిక డేటా ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. పంచవ్యాప్తంగా నాలుగు యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్.. జపాన్, సింగపూర్‌లతో కలిసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి.  వారి పౌరులు ప్రపంచవ్యాప్తంగా వీసా-రహితంగా 227 లో 194 దేశాలను సందర్శించవచ్చు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com