నోల్ కార్డ్ స్కామ్‌.. హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీఏ

- January 12, 2024 , by Maagulf
నోల్ కార్డ్ స్కామ్‌.. హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీఏ

దుబాయ్: దుబాయ్‌లోని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నకిలీ నోల్ కార్డుల అమ్మకాలతో కూడిన మోసపూరిత మార్కెటింగ్ ప్రచారాల గురించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, నోల్ కార్డ్‌ల వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. తాజాగా RTA ప్లాట్‌ఫారమ్‌ను పోలిన మోసపూరిత వెబ్‌సైట్‌లు వారి స్మార్ట్ కార్డ్‌లను టాప్ అప్ చేయాలనుకునే వారిని మోసం చేసిన సంఘటనలు వెలుగులోకి రావడంతో ఆర్టీఏ అలెర్ట్ జారీ చేసింది.  నోల్ కార్డ్‌ల వినియోగదారులు డిజిటల్ విధానాలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈమేరకు తన ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.  వెబ్‌సైట్ (rta.ae) టిక్కెట్ ఆఫీసులు, వెండింగ్ మెషీన్‌లు మరియు (RTA దుబాయ్,  నోల్ పే) అప్లికేషన్‌ల వంటి RTA సేవలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఇటీవల దుబాయ్ నివాసి మొహమ్మద్ సల్మాన్.. తన నోల్ కార్డ్‌ని Dh10తో రీఛార్జ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అలాంటి ఒక మోసపూరిత వెబ్‌సైట్‌ ద్వారా Dh1,051 కోల్పోయాడు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com