ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టివేత
- January 12, 2024
ముంబయి: ముంబయి ఎయిర్ పోర్టులో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది. ఓ థాయ్ మహిళ నుంచి రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు అడీస్ అబాబా నుంచి వచ్చిన 21 ఏళ్ల థాయ్ మహిళను అధికారులు ముంబై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని నిశితంగా పరిశీలించగామ్… తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్ లో బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా కొకైన్ అని తేలింది. పట్టుబడిన కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 40 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ మేరకు సదరు మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..