వినియోగదారుల రక్షణ చట్టంలో కొత్త నేరాలు: 1 మిలియన్ దిర్హాంల వరకు జరిమానా

- January 12, 2024 , by Maagulf
వినియోగదారుల రక్షణ చట్టంలో కొత్త నేరాలు: 1 మిలియన్ దిర్హాంల వరకు జరిమానా

యూఏఈ: వినియోగదారుల హక్కులను మరింత మెరుగ్గా పరిరక్షించేందుకు ఫెడరల్ డిక్రీ లా నం. 5 2023లో 46 కొత్త ఉల్లంఘనలను ప్రవేశపెడుతున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. యూఏఈ ఒక సవరణలో ఇంత పెద్ద సంఖ్యలో నేరాలను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని న్యాయనిపుణులు తెలిపారు. ఈ చట్టం వస్తువుల ప్రొవైడర్లపై 43 కంటే ఎక్కువ కొత్త చట్టాలను తీసుకొచ్చింది. మొత్తం 46 రకాల ఉల్లంఘనలకు Dh1 మిలియన్ వరకు జరిమానాలు ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అల్ సలేహ్ వెల్లడించారు. నిర్దిష్ట కాలపరిమితిలోపు రిపేర్ చేయడం, అమ్మకాల తర్వాత సేవలను అందించడం, వస్తువులను తిరిగి ఇవ్వడం లేదా వాపసు చేయడంలో విఫలమైతే సరఫరాదారుపై Dh250,000 జరిమానా విధించబడుతుందన్నారు. భద్రత మరియు ఆరోగ్యం యొక్క ప్రామాణిక లక్షణాలు, నియమాలు మరియు షరతులను పాటించడంలో విఫలమైన సందర్భంలో సరఫరాదారుపై Dh200,000 జరిమానా విధించబడుతుందని ఆయన చెప్పారు. పదే పదే నేరాలకు పాల్పడితే కొన్ని జరిమానాలు లైసెన్స్ రద్దుకు లేదా వ్యాపారాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com