భవానీ వార్డ్ 1997.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- January 12, 2024
హైదరాబాద్: చిన్న చిత్రాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. రకరకాల జానర్లలో తీసే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు 'భవానీ వార్డ్ 1997' (Bhavani Ward 1997) అనే చిత్రం రాబోతోంది. చంద్రకాంత సోలంకి శివ దోశకాయల గారితో కలిసి విభూ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. పోస్టర్ బాగుందని ప్రశంసించారు. ఇక ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ సైతం సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ మూవీకి అరవింద్ బి కెమెరామెన్‌గా పని చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్, ఇతర వివరాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!