మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్‌ అరెస్ట్

- January 13, 2024 , by Maagulf
మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్‌ అరెస్ట్

జెడ్డా: రియాద్‌లో ఉద్దేశపూర్వకంగా మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి ఘటనా స్థలం నుంచి పారిపోయిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రియాద్ రీజియన్ పోలీసులు వెల్లడించారు. నేరస్థుడిని అరెస్టు చేసి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. రియాద్‌లోని పబ్లిక్ రోడ్‌పై జరిగిన ఈ యాక్సిడెంట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సౌదీ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 63 ప్రకారం.. ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైనవారు ఎవరైనా వాహనాన్ని ప్రమాద స్థలంలో ఆపాలి. సంబంధిత అధికారులకు సమాచారం అందజేయాలి. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైన సహాయం అందించాలి. అలా చేయని పక్షంలో ఆయా వ్యక్తులకు SR10000 జరిమానా లేదా మూడు నెలలకు మించని జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com