వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా..
- January 13, 2024
మచిలీపట్నం: వైసీపీకి, ఎంపీ పదవికి వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. బాలశౌరి కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.
ఆ స్థానంలో ఇప్పుడు ఇతర నేతను నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. తనకు సీటు దక్కదని తేలడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన మద్దతుదారులతో ఇప్పటికే ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. చివరకు జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాం నుంచి బౌలశౌరి ఆ కుటుంబానికి సన్నిహితుడు. కొంత కాలంగా బాలశౌరికి, జగన్కు మధ్య అంతరం ఏర్పడింది.
ఇటీవలే వైసీపీకి, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి సంజీవ్ కుమార్ను తప్పించారు. దీంతో సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ టికెట్ల విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో అసంతృప్త నేతలు వేరే పార్టీల వైపునకు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!