విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా ప్రవాస భాగస్వామ్యం నేరం
- January 16, 2024
రియాద్: కమర్షియల్ కన్సీల్‌మెంట్‌ను ఎదుర్కోవడానికి జాతీయ కార్యక్రమం కింద వాణిజ్యపరమైన దాచడం లేదా కప్పిపుచ్చడం (తసత్తూర్) పరిధిలోకి వచ్చే అనేక కేసులను వెల్లడించింది. తసత్తూర్ కేసులలో సౌదీ పౌరుడు నిర్ణీత నెలవారీ మొత్తానికి బదులుగా సౌదీయేతర వ్యక్తికి వాణిజ్య స్థాపనను అప్పగించడం నేరం. అలాగే విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా ఏదైనా వాణిజ్య కార్యకలాపాలలో భాగస్వామిగా పనిచేస్తున్న సౌదీయేతర వ్యక్తి, సౌదీ పౌరుడి పేరుతో ఉన్న ఏదైనా వాణిజ్య కార్యకలాపాలలో సౌదీయేతర వ్యక్తి పని చేయడం, గృహ కార్మికుడు వంటి సౌదీయేతర వ్యక్తికి ఏదైనా వాణిజ్య కార్యకలాపాలను ప్రాక్టీస్ చేయడానికి అధికారం కల్పించడం చట్టరిత్యా నేరాలు అని వెల్లడించింది. సౌదీ పౌరులకు మాత్రమే వాణిజ్యపరమైన పని చేసే హక్కును మంజూరు చేసిందని గుర్తుచేసింది. విదేశీ పెట్టుబడి లైసెన్సు పొందకుండానే సౌదీయేతర వ్యక్తి ఏదైనా వాణిజ్య కార్యకలాపాన్ని నిర్వహించడం చట్టరిత్యా నేరమని, అలాంటి వాటికి సహకరించిన వారు కూడా నేరం చేసిన వారికిందనే పరిగణించబడతారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!