శబరిమలలో మకరజ్యోతి దర్శనం
- January 16, 2024
కేరళ: కేరళలోని శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి. సంక్రాంతి రోజున ఈ దివ్య దర్శనం కోసం అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు.
రవి ధనుస్సు రాశి నుంచి.. మకర రాశిలోకి ప్రవేశించే వేళ… ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవగా.. మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనాల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేసింది.
కాగా, భక్తులకోసం ఆలయ అధికారులు కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పంబానది, సన్నిధానం, హిల్ టాప్‌తో పాటు టోల్ ప్లాజా సమీపంలో అదనపు భద్రత ఉంది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు వందలాది మంది పోలీసులు పనిచేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!