కృష్ణా పుష్కరాలకు 600 స్పెషల్ ట్రైన్లు
- May 30, 2016
ఆగస్టు నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు, 2000 అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లోని మొదటి ఫ్లాట్‌ఫారమ్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో అశోక్ కుమార్‌తోపాటు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లు సోమవారం సాయంత్రం రైళ్ల రాకపోకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే అన్నిశాఖల అధికారుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. నలుమూలలు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేవిధంగా నాలుగు ప్రధాన హాల్ట్‌ల సౌకర్యం కల్పిస్తామన్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







