ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు!
- January 16, 2024
ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంపికైన గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు, ITI ట్రేడ్ అభ్యర్థులకు AAI వివిధ విభాగాలలో ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తుంది. ఈ సమయంలో విమానయాన రంగంలో మంచి అనుభవం పొందవచ్చు. ఈ అనుభవంతో విమానయాన రంగంలో భారీ జీతంతో మంచి ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు పరిశీలించండి.
- ఖాళీలు
వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 130 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు
2023, డిసెంబర్ 31 నాటికి కనీసం 18 ఏళ్లు ఉండాలి, 26 ఏళ్లు మించకూడదు. అర్హత పరీక్షలో కనీసం 50% మార్కులు సాధించాలి. ఇప్పటికే అప్రెంటిస్షిప్ని పూర్తి చేసి ఉంటే లేదా ముగించి ఉంటే లేదా మరొక సంస్థ లేదా AAIలో ఇదే అర్హతను కొనసాగిస్తున్నట్లయితే ఈ కొత్త ప్రోగ్రామ్‌కు అర్హత ఉండదు.
అప్లికేషన్ ప్రాసెస్
గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు http://nats.education.gov.in పోర్టల్‌లో, ITI ట్రేడ్ అభ్యర్థులు http://apprenticeshipindia.orgపోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2024, జనవరి, 31.
ట్రైనింగ్ ఎక్కడ
ట్రైనింగ్ కోల్‌కతాలోని రీజనల్ హెడ్ క్వార్టర్స్ (RHQ) లేదా తూర్పు ప్రాంతంలోని ఏదైనా విమానాశ్రయంలో జరుగుతుంది. పోర్టల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా నిర్దిష్ట లొకేషన్ కేటాయిస్తారు. ఒకసారి కేటాయించిన తర్వాత లొకేషన్‌ను మార్చడం కుదరదు. అదే ప్రదేశంలో ట్రైనింగ్ పూర్తి చేయాలి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, అండమాన్ & నికోబార్ లేదా సిక్కిం రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో నివసిస్తున్న భారతదేశ పౌరులైతే AAI అప్రెంటిస్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు డిగ్రీ, డిప్లొమా లేదా ITI ట్రేడ్‌ను 2019లో లేదా ఆ తర్వాత పూర్తి చేసి ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్
అర్హత పరీక్షలో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశాక, రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాంటాక్ట్ చేస్తారు. ట్రైనింగ్‌లో చేరడానికి ముందు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాలి. అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యే వరకు ఎంపిక తాత్కాలికంగా ఉంటుంది. మరిన్ని వివరాలు, అప్డేట్ల కోసం, అఫీషియల్ నోటీసును చదవవచ్చు. AAI వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!